‘సాహో’ చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీరియాడిక్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది.ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ అభిమాని పూజా హెగ్డేను అడిగాడు. ఫస్ట్‌లుక్ ఎప్పుడు వస్తుందో చెప్పాలని కోరాడు. అయితే, ఈ ప్రశ్న తనను కాదు, డైరెక్టర్ రాధాకృష్ణను అడగండి అంటూ పూజా తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకుంది. అయితే, రాధాకృష్ణ కూడా ఫస్ట్ లుక్‌పై స్పష్టత ఇవ్వడం లేదు. ఆ విషయం ప్రభాస్, చిత్ర నిర్మాణ సంస్థలకే తెలియాలంటున్నాడు.కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. జార్జియాలో షెడ్యూల్ చేసిన షూటింగ్‌ను ముగించుకున్న చిత్ర బృందం స్వదేశానికి వచ్చింది. ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రభాస్, పూజా హెగ్డేతో పాటు యూనిట్ మొత్తం ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa