ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాపై పోరాటం: సినీ ప్రముఖుల సాయం

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2020, 04:02 PM

ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనాను అంతం చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రభుత్వాలకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పేద కళాకారులను ఆదుకోవడాని చిత్ర పరిశ్రమతో పాటు ప్రజలకు తమవంతుగా సాయం చేయడానికి ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి ఇవ్వనున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మహేశ్‌బాబు భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50లక్షల చొప్పున అంటే రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కూడా కరోనాపై పోరాటంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన కూడా రూ.కోటి విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్‌ కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో పాటు మరో రూ.25లక్షలు తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమ నిధికి ఇచ్చారు. వీరితో పాటు, ఇప్పటికే పవన్‌కళ్యాణ్ - రూ. 2 కోట్లు, నితిన్‌- రూ. 20 లక్షలు, రామ్ చరణ్ - రూ. 70 లక్షలు, త్రివిక్రమ్ - రూ.20 లక్షలు, అనిల్ రావిపూడి - రూ. 10 లక్షలు, కొరటాల శివ - రూ.10 లక్షలు, దిల్ రాజు-శిరీష్ - రూ. 20 లక్షలు, సాయి తేజ్‌ రూ.10లక్షలు విరాళంగా ప్రకటించారు. తన సినిమా కోసం పనిచేస్తున్న 50 మంది కార్మికులకు అల్లరి నరేశ్‌ ఒక్కొక్కరికి రూ.10 వేలు సాయం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa