ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్టు పాత్రలో సమంత ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2018, 04:26 PM

కొత్త సినిమాను అంగీకరించినట్లు సమంత అక్కినేని తాజాగా ప్రకటించింది. కానీ సినిమాలో పాత్రల గురించి మాత్రం ప్రస్తావించలేదు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ పోసిస్తోంది. తెలుగు, తమిళంలో ఏక కాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కన్నడ వర్షన్‌ను తెరకెక్కించిన పవన్ కుమార్ ఇప్పుడు రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది. ఇది ఓ జర్నలిస్టు కథ. ఓ ఫ్లైఓవర్‌పై సంభవించిన కొన్ని మరణాలపై ఇన్వెస్టిగేషన్ చేసే జర్నలిస్టు పాత్రలో సమంత కనిపించనుంది.


ఇదిలా ఉంటే.. ఈ రీమేక్‌లో సమంత బాయ్‌ఫ్రెండ్ పాత్రను ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ పోషించనున్నాడు. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఇటీవల కాలంలో తెలుగులో స్టైలిష్ విలన్‌గా గుర్తింపు ఆకట్టుకుంటున్న ఆది పినిశెట్టి ఈ సినిమాలో పోలీస్‌గా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు పవన్ కుమార్ స్వయంగా ప్రకటించారు. ఆది, సమంత ఇప్పటికే ‘రంగస్థలం’లో కలసి నటిస్తున్నారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ స్క్రీన్‌ను పంచుకోనున్నారు.


మరోవైపు తమిళ స్టార్ హీరో సూర్య, సీనియర్ నటి భూమికా చావ్లాలు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చిత్ర యూనిట్ వీరిద్దరితో చర్చలు జరుపుతోందట. ఇదే గనక ఓకే అయితే.. ఇదో భారీ చిత్రం అవ్వడం ఖాయం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా, ఈ ఏడాది సమంత బిజీబిజీగానే గడుపుతోంది. నాగచైతన్యతో పెళ్లి అనంతరం ‘రంగస్థలం’, ‘మహానటి’ షూటింగుల్లో సమంత పాల్గొంటోంది. మరోవైపు విశాల్‌తో కలసి నటించిన ‘అభిమన్యుడు’ విడుదలకు సిద్ధమవుతోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa