సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. శ్రీమంతుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు ఉదయం స్వాతంత్ర్యం కోసం జరిపిన దండ యాత్ర తరహాలో ఒక సమూహం కలిసికట్టుగా నడవటాన్ని పోస్టర్ ద్వారా చూపిస్తూ మహేష్ ప్రమాణ స్వీకారంకి సంబంధించి ఓ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మహేష్ అభిమానులలో ఆనందం కలుగ జేసినప్పటికి, మహేష్ లుక్ ఎలా ఉంటుందో అనే ఆతృత అభిమానులలో నెలకొంది. ఈ నేపధ్యంలో చిత్ర టైటిల్‌తో పాటు మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. క్లాస్ లుక్‌లో బ్రీఫ్ కేసు పట్టుకొని నడుస్తున్న మహేష్ ని చూసి యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్యమంత్రి అంటూ తన అభిమాన నటుడిని పొగిడేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో డా. బి. ఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ ఫోటోలు ఉండటం ఈ ఫస్ట్‌లుక్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ మూవీని తెరకెక్కిస్తున్నారు కొరటాల. దేవి శ్రీ సంగీతం రూపొందిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఏప్రిల్ 27న మూవీ విడుదలకి ప్లాన్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa