ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజ హెగ్డే పై వస్తున్న డేటింగ్ వార్తలపై పూజా ఎలా స్పందిస్తుందో....

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 05, 2020, 12:30 PM

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతున్న నటి పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించేందుకు ఏకైక ఛాయిస్ గా మారిన పూజా కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈమె డేట్స్ కోసం హీరోలు సైతం వెయిట్ చేసే రేంజ్ ఈ బ్యూటీది. ప్రస్తుతం యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమాలోనూ కనిపించనుంది. ఇక బాలీవుడ్ లో సైతం ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. రీసెంటుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతోపాటు తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటిస్తున్నది. అయితే ఈ అమ్మడు గురించి ఈ మధ్య బాలీవుడ్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా సర్క్యూలేట్ అవుతోంది.వివరాల్లోకి వెళ్తే పూజా ఒక స్టార్ హీరో కొడుకుతో ప్రేమాయణం నడిపిస్తున్నదని బీటౌన్ లో జనాలు చెప్పుకుంటున్నారు. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న పూజా హెగ్డే బాలీవుడ్ లో ప్రముఖ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో అఫైర్ నడుపుతున్నట్టు జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను జత చేస్తూ వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువగానే ఏదో ఉందనే రూమర్ క్రియేట్ చేసారు. ప్రస్తుతం రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే కారులో వెళ్తున్న ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వారిద్దరి డేటింగ్ గురించి బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి. బాలీవుడ్ సంగతి తెలిసిందే కదా.. కలిసి కనిపిస్తే చాలు ఎఫైర్ అంటగడతారు. కానీ ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ విని ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై పూజా హెగ్డే గానీ - అటు రోహన్ మెహ్రా గానీ పెదవి విప్పడం లేదు. మరి ఈ వార్తలపై పూజా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa