ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్ స్టార్ సినిమాలో అనుష్క?

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 05, 2020, 12:41 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తీసుకొని సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్న పవన్ కళ్యాణ్ 2019 ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత తాను ఇంక సినిమాలలోకి రానని - పూర్తి జీవితం ప్రజాసేవకే అని ప్రకటించి అభిమానులను వేదనకు గురిచేసారు. కానీ పవర్ స్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన 'పింక్' సినిమా రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ కి కూడా విశేష స్పందన వచ్చింది. ఇదే ఊపులో తన నెక్స్ట్ ప్రాజెక్టుని కూడా పట్టాలెక్కించేసాడు. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బడా ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసారని సమాచారం. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారట.క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పిరియాడిక్ క్యారెక్టర్ లో నటిస్తున్నారని మంచి కోసం పోరాడే ఓ హిస్టారికల్ పాత్ర అని తెలుస్తోంది. మొత్తానికి చారిత్రక కాలం నాటి ఓ ఎమోషనల్ విప్లవాత్మకమైన చిత్రం అట. కాగా ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే పేరును అనుకుంటున్నారు. అంతేకాకుండా సినిమా పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అని ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పక్కన బొమ్మాళి అనుష్క నటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే క్రిష్ అనుష్కకి స్క్రిప్ట్ కూడా వినిపించాడట. ఇంతకముందు క్రిష్ డైరెక్షన్ లో 'వేదం' సినిమాలో అనుష్క నటించిన విషయం తెలిసిందే. చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ఇదే జరిగితే పవన్ - అనుష్క కాంబినేషన్లో తెరకెక్కే మొదటి సినిమా కానుంది. ఒకవేళ ఈ వార్తే నిజమైతే వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చుసిన అభిమానులకు పండగనే చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa