ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజిత పొన్నాడకి బంపర్ ఆఫర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2020, 09:31 AM

పూజిత పొన్నాడ.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమా 'రంగస్థలం'లో ఆది పినిశెట్టికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ భామకు ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా పూజిత 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' కల్కి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమా కథ రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందని సమాచారం. కాగా ఈ సినిమాలో ఓ పాటలో తెలుగమ్మాయి పూజిత కనిపించనుందట. అంతేకాదు ఓ భారీ సెట్ లో ఇప్పటికే ఈ పూజితపై సాంగ్ షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. హిందీ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ పవన్ సరసన నటించనుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న విరూపాక్ష షూటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa