తెలుగు టీవీ యాంకర్ రష్మీ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. ఈ భామ ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో కామెడీ షోతో అంత పాపులర్ అయ్యింది. రష్మీ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆ షోకు కావాల్సినంత గ్లామర్ అందిస్తూ అదరగొడుతోంది. అది అలా ఉంటే కరోనా కారణంగా తాము పెంచుకుంటున్న కుక్కలను కొందరు రోడ్డుపై వదిలేస్తున్నారు. దీంతో అవి తిండి లేక చావు బతుకుల మధ్య పోరాడుతున్నాయి. ఈ లాక్ డౌన్ సమయంలో వాటిని పట్టించుకునే వారే కరవైపోయారు. దీనికి సంబందించిన ఓ వీడియోను రష్మి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలలో ఓ కుక్క పిల్ల ఆకలితో అలమటిస్తూ, కదలలేక, ఎటూ చూడలేక మూలుగుతోంది. దీంతో భావోద్వేగానికి గురైన రష్మి ఆ మూగజీవాల్నీ చూసి నాకు పిచ్చేక్కుతోందని.. పేర్కోంటూ.. ఈ సందర్భంగా రష్మి కేంద్ర మంత్రి మేనకా గాంధీకి రష్మీ ఓ విజ్ఞప్తి చేసింది. కుక్క పిల్లల్నీ కొనుక్కునే సమయంలో యజమానుల నుంచి హామీ తీసుకోవాలని రష్మీ సూచించింది. ఇందుకోసం పత్రాలపై సంతకాలు చేయించుకోవాలని అవి కఠినంగా ఉండాలనీ కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa