రాజకీయాల్లో అడుగుపెట్టిన కారణంగా కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ సినిమా ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, ఓ పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. దాంతో, పవన్‌ను మళ్లీ తెరపైన ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోడవంతో ఈ చిత్రం కొంత ఆలస్యం కానుంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa