‘అరవింద సమేత’ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై మంచి రికార్డ్స్ సాధించింది. తెలుగు తెరపై హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు, ఆ తరువాత విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు. విలన్ గా ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. అలాంటి సినిమాల్లో 'అరవింద సమేత' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో 'బసిరెడ్డి' పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వున్న జగపతిబాబు ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.'ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నాను గదా .. అందువలన గతంలో నేను చేసిన సినిమాలను మళ్లీ చూసుకుంటున్నాను. బాగా చేశానా .. లేదా అని నాకు నేను గా ప్రశ్నించుకుంటున్నాను. అలా 'అరవింద సమేత' చూసిన తరువాత, 'బసిరెడ్డి' పాత్రను ఇంకా బాగా చేయాల్సిందనిపించింది. కొన్ని సన్నివేశాల్లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదనిపించింది. అప్పుడు నా మూడ్ బాగోలేకపోవడమే అందుకు కారణమనుకుంటున్నాను. మూడ్ బాగోలేకపోతే ఆ ప్రభావం నటనపై పడుతుందని నాకు అర్థమైంది. అందుకే ఇకపై అలా జరగకుండా రిలాక్స్డ్ గా వుండాలని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa