ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ సంచలనం..!

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 19, 2020, 01:29 PM

విజయ్ దేవరకొండ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ ఫార్మాట్ లో దుమ్మురేపుతోంది. ఏకంగా ఈ చిత్రం ఇండియా వైడ్ గా సెకండ్ పోజిషన్ లో ట్రెండ్ అవుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా రెండు రోజుల క్రితం ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ కి అంబాటులోకి తెచ్చింది. విశేష ఆదరణ దక్కించుకుంటున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఇండియా వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తుంది.ఈ మూవీ థియేటర్స్ లో అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తెలుగు మరియు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది. అలాంటిది డిజిటల్ ఫార్మాట్ లో ఇంతటి ఆదరణ దక్కించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ కూడా థియేటర్స్ లో విఫలం చెంది, ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విజయం సాధించింది. సీనియర్ నిర్మాత కే ఎస్ రామారావు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని తెరకెక్కించగా, క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa