ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాంకర్ రవి పై అనసూయ ఫైర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 19, 2020, 10:07 PM

అసలు సిసలు తెలుగు అందం.. 100 పర్సెంట్ తెలుగు అందం అంటే ఏంటో చూపించారు అంటూ రంగమ్మత్త...  యాంకర్ రవి అంటేనే ఎనర్జీ...ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుండే అతడి చలాకీ తనమే అతడి ఆస్తి అని చెప్పవచ్చు. రవి బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్నాడు. వెండితెర పైనా మెరిశాడు.అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేశాడు. దీంతో రవి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేక ఇంటికే పరిమితం అయ్యాడు. అయితే యాంకర్ రవి ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ప్రస్తుతం యూట్యూబ్ లో వీడియోలు తయారు చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ ను సంతోష పెట్టేందుకు రవి ఎంతో ట్రై చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలోనే రవి ఓ ప్రాంక్ కాల్ చేసి యాంకర్ అనసూయ చేతిలో చివాట్లు తిన్నాడు. యాంకర్ అనసూయకు ఫోన్ చేసి తాను తెలంగాణ హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. అయితే అటు అనసూయ కూడా రవిని గుర్తు పట్టలేదు. దీంతో చివరికి రవి స్వయంగా తానే అని చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే అనసూయ మాత్రం ఇది ప్రాంక్ కాల్ చేసే టైమ్ కాదని, కాస్త గట్టిగానే ఫైర్ అయ్యింది. ఇద్దరి మధ్యలో మంచి రిలేషన్, చనువు ఉన్నప్పటికీ అనసూయ మాత్రం బూతులు తిడుతూ విరుచుకుపడింది. దీంతో రవి ఆశ్చర్యపోవడం అతడి వంతు అయ్యింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa