సంవత్సరంలో సగంకి పైగా రోజులని సినిమా షూటింగ్స్‌తో గడిపే మన సెలబ్రిటీలు ఇప్పుడు లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయాన్ని కొందరు చక్కగా వినియోగించుకుంటున్నారు. తమలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ లోపాలని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించిన నిధి అగర్వాల్ ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఆన్‌లైన్ కోర్సు చేరింది.
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఎంతో మంది ప్రతిభావంతులైన నటులని, దర్శకులని తయారు చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా నటనతో పాటు స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ కోర్సులని ఆన్‌లైన్‌లో నేర్చుకుంటుంది. దీంతో తన రచన మరియు దర్శకత్వ నైపుణ్యాలని పెంచుకోవాలని భావిస్తుంది. అంటే రానున్న రోజులలో నిధి అగర్వాల్‌ని మనం దర్శకురాలిగా చూసే అవకాశం ఉందన్నమాట. నిధి ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తొలి చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa