ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. దాంతో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉంటుంది? ఆయన ఎలా కనిపిస్తాడు? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ సినిమాలో ఆయన ఓ మాఫియా డాన్ కి కొడుకుగా కనిపిస్తాడట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొంతసేపు అలా కనిపించే ఆయన, ఆ తరువాత మాఫియాకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడని అంటున్నారు. మాఫియా ముఠాకి .. కథానాయకుడికి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలే ఈ సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు. విజయ్ దేవరకొండపై డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్, ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేసేలా వుంటాయని అంటున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా 'అనన్య పాండే' పరిచయమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa