విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే నిర్ణయంతో పూరి వున్నాడు. యూత్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత పూరి నెక్స్ట్ మూవీ ఏ హీరోతో వుండనుందనే విషయంపై అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో బాలకృష్ణతో 'పైసా వసూల్' చేసిన పూరి, తాజాగా బాలకృష్ణకి కాల్ చేసి కథ వినిపించాడట. కథలో కొత్తదనం కారణంగా వెంటనే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. 'ఫైటర్' పనులు పూర్తి కాగానే బాలకృష్ణ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా పూరి ప్లాన్ చేసుకుంటున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa