ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ 2' సినిమా లో కీలక మార్పు

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2020, 10:23 AM

యువ హీరో నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఎన్నో వాయిదాల తర్వాత రిలీజైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ నిర్మాణంలో 18 పేజెస్ సినిమా చేస్తున్న నిఖిల్.. ఆ సినిమాతో పాటుగా చందు మొండేటి డైరక్షన్ లో సూపర్ హిట్ మూవీ కార్తికేయ సీక్వల్ కూడా ప్లాన్ చేశాడు. కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా సినిమాపై అది అంచనాలు పెంచింది. అందుకే ఆ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో కథానాయికగా 'కలర్స్' స్వాతి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. అలాంటి ఆ సినిమాకి  'కార్తికేయ 2' టైటిల్ తో సీక్వెల్ రూపొందుతోంది.ఈ సినిమాలో 'కలర్స్' స్వాతి చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అది నిజమేననేది తాజా సమాచారం. ఈ సినిమాలో ఆమె హీరోకి మాజీ లవర్ గా కనిపించనుందని అంటున్నారు. చాలా రోజుల తరువాత 'కలర్స్' స్వాతి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ప్రధాన కథానాయిక పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa