కమల్ గారాల పట్టి శృతి హాసన్ చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా నెటిజన్స్‌తో కాసేపు ముచ్చటించింది. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ మూవీ తర్వాత తెలుగు సినిమాలు తగ్గించేసింది. దీనికి తోడు శృతి నటించిన సినిమాలు వరుసగా ప్లాప్స్ కావడంతో ఈ భామకు ఇటు తెలుగులో కానీ, అటూ తమిళ్‌లోగానీ సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు. మరోవైపు శృతి గతంలో కొంత కాలం ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్‌తో ఆమె కొంతకాలంగా డేటింగ్ చేసి.. ఆ తర్వాత విడిపోయింది ఈ జంట. ఇవన్నీ కూడా శృతిని కుంగదీసాయనే అంటారు ఆమె అభిమానులు. దీంతో అడపదడపా సినిమా అవకాశాలు వచ్చిన కొన్నింటిని రిజెక్ట్ చేసిందని టాక్. అది అలా ఉంటే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల సామాన్యలు, ముఖ్యంగా రోజువారి పనిచేసుకుని పొట్టగడుపుకోనే వారు తీవ్రంగా నష్ట పోతున్నారు. దీంతో అంతో ఇంతో సామాజిక సృహ, సమాజం పట్ల సోయి ఉన్నవారు ముందుకొచ్చి తోచిన సాయం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఆమె విరాళాన్ని ప్రకటించకపోవడంపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు. అందుకు శ్రుతి హాసన్ తనదైన శైలిలో స్పందిస్తూ .. "నాకు చెప్పేవారు కరోనా బాధితులకు ఎంతగా సేవ చేస్తున్నారో తెలుసుకోవాలని వుందని.. మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే, ఆ భగవంతుడు కూడా మనకి అంతగా సహాయం చేస్తాడని నమ్మే మనిషిని నేను. సాయం నాకు చెయ్యాలనిపిస్తుంది .. చేస్తాను. అంతేగానీ ఏవరో చెప్పారనీ నేను చేయను. అంతేకాదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. గతంలో నేను సాయం చేసిన సందర్భాలు చాలా వున్నాయి" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక శృతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన క్రాక్ మూవీలో నటిస్తుంది. గోపిచంద్ మలినేని దర్శకుడు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa