ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ మాటలకు సుమ షాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 21, 2020, 10:31 AM

అనసూయ భరద్వాజ్..తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా.. సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది నిత్యం టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతోన్న అనసూయ.. కరోనా లాక్ డౌన్ తో ఒక్కసారిగా ఇంటికే పరిమితం అయిపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక అనసూయ తెగబాధపడుతోంది. అయితే ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కారణమో, లేక పిల్లలను మిస్ అవుతున్నాను అనే బాధో తెలియదు కానీ, తన కెరీర్ కు ఇకపై ఫుల్ స్టాప్ పెడతాను అంటూ వేదాంతం వల్లిస్తోంది. యాంకర్ సుమ తన ఇంట్లోనుంచే వీడియో కాల్ చేసి తయారు చేసిన ప్రోగ్రాంలో అనసూయ కాస్త మూడీగా కనిపించింది. లాక్ డౌన్ లో తాను రిటైర్ అయిన ఫీలింగ్ కలుగుతోందని చెప్పుకొచ్చింది. అయితే అనసూయ మాటలకు సుమ షాక్ కు గురైందనే చెప్పాలి. ఈ లైవ్ షోలో అనసూయతో పాటు యాంకర్ రవి, రష్మీ, ప్రదీప్ మాచిరాజు కూడా పాల్గొన్నారు. అయితే ముందు ముందు షూటింగ్స్ స్టార్ట్ అయ్యాక అనసూయ కెరీర్ మునుపటిలా బిజీగా ఉంటుందా...లేక ఇంటికే పరిమితం అవుతుందా అని అటు ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. అయితే అనసూయ బుల్లితెర కంటే వెండితెరపైనే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. గత ఏడాది ‘కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ కు ప్రేక్షకులు పెద్ద షాకె ఇచ్చారు. ఇక, ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తుందని డైరెక్టరే స్వయంగా ప్రకటించాడు. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో సహా మరికొన్నింటిలో ఆమె నెగెటివ్ రోల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.ఇదిలావుంటే .. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘అంధాధున్'. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు గానూ అనసూయ సంతకం చేసేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర చేస్తుందని ప్రచారం జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa