విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు మాస్ ఆడియన్స్ ను మెప్పించే దర్శకుల జాబితాలో పూరి పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ఇక మాస్ ఇమేజ్ వున్న బాలకృష్ణతో కొంతకాలం క్రితం ఆయన 'పైసా వసూల్' అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో ఆయన బాలకృష్ణను చాలా స్టైలీష్ గా చూపించాడు.తాజా ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ .. "బాలకృష్ణగారికి నేను 'పైసా వసూల్' కథను 10 నిమిషాల పాటు చెప్పగానే ఓకే అనేశారు. కేరక్టర్ పేరు 'తేడా సింగ్' అని చెప్పినప్పటికీ అభ్యంతర పెట్టలేదు. ఇక నాతో సినిమా చేయవద్దని ఆయనకి చాలామంది చెప్పారు .. అయినా ఆయన వినిపించుకోలేదు. బాలకృష్ణ అంటే ఏమిటన్నది నాకు అప్పుడే తెలిసింది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఎంతో ఎనర్జీతో వుంటారు. బాలకృష్ణగారు ముక్కుసూటి మనిషి .. ఆయన ఏ విషయాన్నీ మనసులో దాచుకోరు. ప్రేమ .. కోపం రెండూ వెంటనే చూపించేయడం ఆయన అలవాటు" అని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందన్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa