ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉప్పెన' తమిళ రీమేక్ లో హీరో ఎవరో తెలుసా ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 23, 2020, 01:30 PM

 వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన'రానునుంది.  ఈ సినిమా ద్వారా కృతి శెట్టి హీరోయిన్ గా  పరిచయం కానుంది. ఈ సినిమాలోహీరోయిన్ తండ్రిగా .. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 2వ తేదీనే విడుదల కావలసింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా కథాకథనాలు నచ్చడంతో, తమిళ రీమేక్ హక్కులను విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నాడు. హీరో విజయ్ మంచి టీనేజ్ లవ్ స్టోరీ దొరికితే తన తనయుడు జాసన్ సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వున్నాడు. ఆ విషయం తెలిసిన విజయ్ సేతుపతి, ఈ కథను గురించి విజయ్ కి చెప్పాడట. కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగులో తను చేసిన పాత్రనే తమిళంలోను విజయ్ సేతుపతి చేయనున్నాడట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa