నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ ను తీసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు అనూ ఇమాన్యుల్ నే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేయనున్నారు. మరి అనూ ఇమాన్యుల్ కెరీర్‌కు ఈ సినిమాతో బ్రేక్ లభిస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa