ఆ విషయంలో హీరో ప్రభాస్.. బాలకృష్ణను ఫాలో అవుతున్నాడా ? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యకాలంలో మన హీరోలందరు సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ బాలకృష్ణ, ప్రభాస్ మాత్రం సోషల్ మీడియాలో మిగతా హీరోల వలె అంత యాక్టివ్‌గా లేరు. ఇక చిరంజీవి రీసెంట్‌గా సోషల్ మీడియాలో అడుగుపెట్టి పూటకో ట్వీట్‌తో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన బీ ది రియల్ మెన్ ఛాలెంజ్‌ను ప్రారంభించి రాజమౌళిని నామినేట్ చేసాడు. జక్కన్న ఈ ఛాలెంజ్‌ను ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, కీరవాణిని బీ ది రియల్ మేన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా.ఇక ఎన్టీఆర్ కూడా రాజమౌళి చాలెంజ్ స్వీకరించి బాబాయి బాలయ్యతో పాటు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్‌లతో పాటు దర్శకుడు కొరటాల శివను నామినేట్ చేసాడు. ఇక తారక్ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసి చిరంజీవి, వెంకటేష్ ఇంట్లో పనులు చేసారు. చిరంజీవి.. రజినీకాంత్, కేటీఆర్‌ను నామినేట్ చేస్తే.. వెంకటేష్ మాత్రం మహేష్ బాబు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసాడు. ఐతే.. బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ ఛాలెంజ్‌కు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇక బాలయ్య బాబు సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ తప్పించి మిగతా వాటికి దూరంగా ఉన్నారు. అందులో కూడా ఆయన ఎఫుడు ఏ పోస్ట్ పెడతారో చెప్పడం కష్టమే.మరోవైపు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రాజమౌళి బీ ది రియల్ మేన్ ఛాలెంజ్ స్వీకరించి ఇంట్లో పనులు చేయడమే కాదు.. హీరో ప్రభాస్, అడివి శేష్,అల్లు అర్జున్‌లను నామినేట్ చేసాడు. అడివి శేష్, అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటారు. కానీ ప్రభాస్..సోషల్ మీడియా ఫ్లాట్‌పామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ తప్పించి ట్విట్టర్‌లో అడుగుపెట్టలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఎపుడో అమాస, పున్నానికి తప్పించి ఎక్కువగా పోస్ట్ చేసింది లేదు. కరోనాపై పోరాటంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రంతో పాటు సిసిసికి విరాళం ప్రకటించిన సందర్భంగా తప్పించి మరో పోస్ట్ చేయలేదు. కానీ మిగతా హీరోలు మాత్రం కరోనా నేపథ్యంలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో దగ్గరగా ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం సోషల్ మీడియాలో శోభు యార్లగడ్డ ‘బీ ది రియల్ మేన్’ ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన ఇంట్లో పనులు చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి సోషల్ మీడియా విషయంలో బాలకృష్ణ,ప్రభాస్.. ఎవరిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఈ విషయంలో దొందూ దొందే అనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa