'విరాటపర్వం' సినిమాలో రానా హీరో గా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా రానా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. ఇక నక్సలైట్ గా సాయిపల్లవి కనిపించనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.దాంతో ఆమె ఏ పాత్రలో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె కూడా నక్సలైట్ పాత్రలో కనిపించనుందనేది తాజా సమాచారం. ఇంతవరకూ 70 శాతం చిత్రీకరణ జరుపుకుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ రిచర్డ్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ప్రియమణిపై కూడా యాక్షన్ సీన్స్ వున్నాయట. ఇక ఆమె 'నారప్ప' సినిమాలోను కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa