‘కరోనా’ కట్టడి నిమిత్తం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సామాన్యుడి నుండి సెలెబ్రిటీల వరకు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ ప్రముఖులంతా చాలా రోజులుగా తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైలో ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన జీవితంలో ఇదే అతి పెద్ద విరామం అంటోంది . లాక్ డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నానంటోంది కథానాయిక రకుల్. 'ఉదయాన్నే యోగా చేస్తున్నాను. ఆ తర్వాత పుస్తకాలు చదువుతున్నాను. మధ్యాహ్నం పూట సోషల్ మీడియా మీద కూర్చుంటున్నాను. సాయంకాలం ఒక సినిమా చూస్తున్నాను. మధ్యలో అప్పుడప్పుడు వంట కూడా చేస్తున్నాను.. ఇలా గడిపేస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చింది రకుల్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa