బాలయ్యతో దర్శకుడు బోయపాటి శ్రీను చేసిన సింహ, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఈనేపథ్యంలో బాలయ్యకు ఆయనకు ఎలా కుదిరించి అని అడిగితే బోయపాటి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఏ విషయమైనా క్లారిటీగా వివరిస్తే బాలయ్యను కన్వీన్స్ చేయడం ఈజీ అట. ఓ పాట కావచ్చు, ఫైట్ కావచ్చు ముందు టెక్నిషియన్స్ తో డిస్కస్ చేసిన తరువాత బోయపాటి బాలకృష్ణకు వివరంగా చెప్పేవారట. అలాగే బాలయ్యకు ఏ సన్నివేశం రాసిన అది ఆయన సహజ మేనరిజం కి సరిపోయేలా ఉండాలి అన్నారు. ఫోర్స్డ్ సన్నివేశాలు, మేనరిజం బాలయ్యకు సెట్ కాదని బోయపాటి చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా మిర్యాల రవీంధర్ రెడ్డి ఉన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa