ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిబంధనలను పాటిస్తూ షూటింగ్ నిర్వహిస్తామని మంత్రి తలసానిని కోరిన టీవీ ఛానళ్ల ప్రతినిధులు

cinema |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 04:50 PM

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ల వద్దే ఉంటున్నారని... వారికి ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు షూటింగ్ లకు అనుమతించాలని ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఛానళ్ల ప్రతినిధులు కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ లను నిర్వహిస్తామని చెప్పారు. వారి విన్నపంపై సానుకూలంగా స్పందించిన తలసాని... ఈనెల 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa