మహానటి సినిమా తరువాత నాగ్ అశ్విన్ ఎటువంటి కథ చెప్పుతాడు అనుకుంటున్న తరుణంలో ఓ భారీ యూనివర్సల్ స్టోరీ చెప్పారట నాగ్ అశ్విన్. వందల కోట్ల బడ్జెట్ అవసరమయ్యే ఈ సినిమాకు ప్రభాస్ కరెక్ట్ అని నాగ్ అశ్విన్ ఆయనకి సూచించారట. ఇక కథ విన్న ప్రభాస్ వెంటనే ఓకె చెప్పారట. ఓ అద్భుతమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందన్న ఆయన 2020 అక్టోబర్ లో మొదలుపెట్టి 2022 ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. దశాబ్దాలుగా స్టార్ ప్రొడ్యూసర్ గా అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అశ్వినీ దత్ తీశారు. ఆయన నిర్మాణంలో చిరంజీవి, కె రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి టాలీవుడ్ లో ఓ మైలురాయి లాంటి చిత్రం. 1990 మే 9న విడుదలైన ఆ సినిమా 30ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. ఈ సంధర్భంగా అశ్వినీ దత్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంధర్భంగా అనేక విషయాలు పంచుకున్న అశ్విని దత్… ప్రభాస్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa