మహేష్ తరువాత సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో మూవీ ప్రకటించి తరువాత క్యాన్సిల్ చేశారు. ఐతే ఈ మూవీ క్యాన్సిల్ చేయలేదు కేవలం డిలే అయ్యిందని కూడా వినిపిస్తుంది. ఇక కొన్నాళ్లుగా అనేక దర్శకుల నుండి కథలు వింటున్న మహేష్ పరుశురాం తో మూవీ ఒకే చేశారు. దర్శకుడు పరుశురాం కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో మరోమారు చాటాడు. రికార్డ్ వసూళ్లు దక్కించుకున్న ఆ చిత్రం మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. కాగా దీనిపై కృష్ణ గారి జన్మదినం సందర్భంగా మే 31న అధికారిక ప్రకటన రానుంది. ఐతే అదే రోజు మహేష్ మరో చిత్రాన్ని కూడా ప్రకటించే సూచనలు కలవు. హోల్డ్ లో ఉన్న వంశీ పైడిపల్లి మూవీ లేదా మరో కొత్త చిత్రాన్ని ఆయన ప్రకటించవచ్చు అంటున్నారు. రాజమౌళితో మూవీ ఉంటుందని అధికారిక సమాచారం అందిన నేపథ్యంలో ఆ మూవీకి ముందు కనీసం రెండు చిత్రాలు మహేష్ చేయాలని అనుకుంటున్నారు. ఆ రెండు చిత్రాలను మహేష్ మే 31న ప్రకటిస్తారేమో చూడాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa