ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదర్స్ డే సందర్భంగా ఫొటోలు పోస్ట్ చేసి చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Sun, May 10, 2020, 02:17 PM

మదర్స్ డే సందర్భంగా సినీనటులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు వారు తమ తల్లులతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అందులో భాగంగా చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తన తల్లికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు.తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు తాను తల్లితో తీసుకున్న ఫొటోలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. జీవితంలో మనకు సంబంధించిన ప్రతి కథ వెనుక మన తల్లి కథ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే అమ్మకు సంబంధించిన కథతోనే మనందరం జీవితాలను మొదలుపెట్టామని అన్నారు.మాతృదినోత్సవం సందర్భంగా మహేశ్ బాబు తన తల్లి ఫొటోతో పాటు తన భార్య ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'నా జీవితానికి మార్గదర్శకాలుగా నిలిచింది వీరిద్దరే. అసాధారణ ప్రేమ కురిపించే మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa