ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొద్ది రోజులగా ఓ వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అయితే మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత.. అనారోగ్యంతో 2017లో మరణించింది. తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు వృత్తిపరమైన ఇబ్బందులు అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.అలాగే, తన వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా లేదని, త్వరలోనే అంతా సర్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన దిల్ రాజు, ఈ తాజా మలుపుతో వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తన పోస్ట్ లో పేర్కొన్నారు.కాగా, నిజామాబాద్ లోని వెంకటేశ్వరస్వామి గుడిలో ఇవాళ రాత్రి వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. తన కుటుంబసభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa