ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RX100కు సీక్వెల్..పాయల్ ప్లేస్ లో కొత్త హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Sun, May 10, 2020, 02:28 PM

RX100 సినిమా ద్వారా పాయల్ రాజ్ పుత్ తెలుగు సినిమా కి  పరిచయమై తమ నటనతో అదరగొట్టారు. దాదాపు రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 20 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. రెవెన్యూ పరంగానే కాకుండా సినిమాలో నటించిన పాయల్‌కు, హీరోగా చేసిన కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో సూపర్ పాపులరైన పాయల్ రాజ్ పుత్ తెలుగులో మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది. హీరో కార్తికేయ కూడా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ ఆరె ఎక్స్ 100 సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతుందని సమాచారం. అజయ్ ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమాను చేస్తున్నాడు. శర్వానంద్, సాయి పల్లవిలు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే RX100కు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. అజయ్ భూపతి తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా రెండేళ్లు పూర్తి అయిన సందర్బంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన సీక్వెల్ ను ప్రకటించాడు.  RX100కు సీక్వెల్  గురించి మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఈ సినిమాకు సీక్వెల్ ను తీస్తాను. సీక్వెల్ స్టోరీ కూడా కార్తికేయకు సూట్ అయ్యేలా ఉంటుందని పేర్కోన్నాడు. ఈ తాజా సీక్వెల్‌కు హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు. పేరుకు మాత్రమే సీక్వెల్‌గా ఉంటూ మొదటి కథకు పూర్తి విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa