ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏనుగులను మచ్చిక చేసుకోనున్న రానా

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2018, 03:08 PM

విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, సక్సెస్ లను రానా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'హాథీ మేరా సాథీ' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఏనుగులతో స్నేహంగా వుండే పాత్రలో కనిపించనున్నాడు. ఆయనతో పాటు 15 ఏనుగులు షూటింగులో పాల్గొననున్నాయి. 


ఈ నెల చివరిలో 'థాయ్ ల్యాండ్' అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ లోగానే ఆ ఏనుగులతో మచ్చిక చేసుకోవడం వలన మంచి అవుట్ ఫుట్ వస్తుందని భావించిన రానా, అందుకోసం 15 .. 20 రోజులను కేటాయించనున్నట్టు సమాచారం. అనుకున్న సమయానికి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాల్లో దర్శకుడు ప్రభు సాల్మన్ వున్నాడు. హిందీతో పాటు తెలుగు .. తమిళ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa