యంగ్ హీరో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకోవడంతో పాటు సినిమా ఏ అంశం పై ఉంటుందనే విషయాన్ని క్లారిటీగా చూపించింది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడుతుందట. మెయిన్ గా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ చేయాల్సి రావడం, అలాగే సినిమాలో టాప్ – క్లాస్ విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి రావడం కారణంగా ఈ చిత్రానికి అంత బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa