ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశాలో ఉన్న భారతీయులకు సల్మాన్ ఖాన్‌ సూచనలు

cinema |  Suryaa Desk  | Published : Mon, May 18, 2020, 03:58 PM

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు.యూఏఈలోని భారతీయులకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక సూచనలు చేశారు. కరోనాపై పోరులో అబుదాబిలో ఉన్న భారతీయులు హీరోలుగా నిలవాలని ఆయన చెప్పారు. ప్రజలు సర్కారు మార్గదర్శకాలను పాటించాలని, అత్యవసర వస్తువులకు తప్ప, ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఆయన కోరారు. ఒక వేళ ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే  పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్‌-19 కట్టడి చర్యలను పాటించాలని, తమ కుటుంబాల రక్షణలో తామే హీరోలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యూఏఈలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa