స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన కెరీర్ లో తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కింది.ఇప్పుడు రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ 'ధృవ' చిత్రాన్ని చేశాడు. అది చరణ్ ను సరికొత్తగా చూపించడమే కాకుండా, అభిమానులను కూడా అలరించింది. అతని స్టయిల్ నచ్చడంతోనే తన తండ్రి చిరంజీవితో నిర్మించిన 'సైరా' చిత్రానికి సురేందర్ రెడ్డికి దర్శకత్వ బాధ్యతల్ని చరణ్ అప్పగించాడు.ఇక ఇప్పుడు తను రాజమౌళితో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయడానికి ఇంకా ఏ చిత్రం కమిట్ కాలేదు. పలువురు దర్శకులు చెబుతున్న కథలు వింటున్నప్పటికీ, ఎవరికీ ఆయన ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయాలని చరణ్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథా చర్చలు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్టు, 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇదే సెట్స్ కి వెళ్లనున్నట్టూ సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa