పూరి జగన్నాద్ డైరెక్టర్ గా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇక ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి అయినది అట. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం గమనార్హం. పూరి కనెక్ట్స్ బ్యానర్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ మూవీ ఫైటింగ్ నేపథ్యంలో ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు.ఆమె విజయ్ దేవరకొండ మూవీ గూర్చిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఫైటర్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే… ఓ ఆసక్తికర టైటిల్ ఈ మూవీ కోసం రిజిస్టర్ చేసి ఉంచడం జరిగింది. త్వరలోనే టైటిల్ పై ప్రకటన ఉంటుంది అని ఆమె చెప్పుకొచ్చారు.పూరి సినిమాలకు టైటిల్స్ చాలా భిన్నంగా ఉంటాయి. మరి ఈ మూవీ కోసం ఆయన ఎలాంటి క్రేజీ టైటిల్ మైండ్ లో ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa