ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూనియర్ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

cinema |  Suryaa Desk  | Published : Wed, May 20, 2020, 04:31 PM

సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో సినిమాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గా ప్రేక్షకుల్లో బలమైన పునాదినే వేశాడు. పోలికల్లో, నటనలో, హావభావాల్లో, వాచకంలో, వాగ్దాటిలో, డైలాగులు చెప్పడంలో అచ్చం సీనియర్ ఎన్టీఆర్ నే మరిపించాడు. ఆనాటి సినిమాలల్లో మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత ఎన్‌టిరామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయిజూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌ డే భీమ్‌.. తారక్‌.. నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు.'మా ఎన్టీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో కొమరం భీమ్ గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమోగాలని ఆశిస్తున్నాను' అంటూ దర్శకుడు రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. 'హ్యాపీ బర్త్ డే నాన్నా' అంటూ నందమూరి కల్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. సినీ పరిశ్రమలో తన ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచీ తనతో కలిసి తారక్‌ ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు బిగ్‌బాస్‌-1 హౌస్‌మేట్స్‌ ఆయనకు ఓ వీడియో రూపంలో శుభాకాంక్షలు చెప్పారు. దీన్ని సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ వీడియో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. బిగ్‌బాస్‌1 లోని హౌస్‌మేట్స్‌ అందరూ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో గతంలో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa