ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానా నిశ్చితార్థ స్పష్టతనిచ్చిన సురేశ్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Wed, May 20, 2020, 04:38 PM

దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. దగ్గుబాటి వారసుడు రానా ఇటీవల తన ప్రేయసి మిహికా బజాజ్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేస్తూ పెళ్లి కబురు చెప్పగా.. నేడు (మే 20) వీరి నిశ్చితార్థం హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. రానా, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం ఈ రోజేనంటూ వచ్చిన వార్తలపై రానా తండ్రి, నిర్మాత సురేశ్ బాబు స్పందించి స్పష్టతనిచ్చారు. ఈ రోజు సాయంత్రం ఇరు కుటుంబాలు మర్యాదపూర్వకంగానే కలుసుకుంటున్నాయని వివరించారు. నిశ్చితార్థంతో పాటు పెళ్లి తేదీలపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.కాగా, రామానాయుడు స్టూడియోలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వారిద్దరి నిశ్చితార్ధ వేడుక జ‌ర‌గ‌నుందని వార్తలు వచ్చాయి. పెళ్లి కూతురు మిహీకా బజాజ్ కూడా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొంది,  ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa