మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే కదా. ఆయన నిజమైన దేశ భక్తుడు అంటూ కొనియాడారు. అంతేకాదు గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే.. ఆయన గాంధీని చంపక ముందు వరకు ఆయన ఎలాంటి నేరాలు చేయలేదు.అయితే ఆయనకు అనూహ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మద్దతు లభించింది.గాంధీని నాథూరాం గాడ్సే చంపాడని మాత్రమే చెబుతున్నారని... అయితే, ఎందుకు చంపాడనే విషయాన్ని మాత్రం ఎవరూ ఎందుకు చెప్పడం లేదని వర్మ ప్రశ్నించారు. గాంధీని ఎందుకు చంపాడనే విషయం తెలియకపోవడం వల్లే... గాడ్సే అందరి దృష్టిలో విలన్ గా మారిపోయాడని అన్నారు. వాస్తవానికి గాంధీకి గాడ్సే ఫాలోయర్ అని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం, భారత్-పాక్ విడిపోవడం రెండూ గాడ్సే కోరుకున్నాడని.. అవి రెండూ జరిగాయని... అయినా ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాన్ని అప్పటి ప్రభుత్వం బయటకు రానివ్వలేదని చెప్పారు.అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో గాంధీని ఎందుకు చంపాడనే విషయాన్ని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదని భావించి ఉండొచ్చని వర్మ అన్నారు. ఏదేమైనా గాడ్సేకి ఉన్న దేశభక్తి విషయంలో నాగబాబుతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పారు. గాడ్సే కథతో తాను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa