ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్ బాబు ..

cinema |  Suryaa Desk  | Published : Wed, May 20, 2020, 05:04 PM

ఈ రోజు  యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ రోజు ఎన్టీఆర్ 36 ఏళ్లు కంప్లీట్ చేసుకొని 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఈ జూనియర్ ఎన్టీఆర్‌‌కు సినీ రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందజేసారు.  తాజాగా ఎన్టీఆర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే విషెస్ తెలియజేసాడు. వీళ్లిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. గతంలో ఎన్టీఆర్.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అను నేను’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేసాడు. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో నెక్ట్స్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్.. తాతా ఎన్టీఆర్, బాబాయి బాలకృష్ణ వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు మహేష్ బాబు కూడా .. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిసి నటిస్తే బాగుంటుందని ఇరు హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa