ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ అభిమానం వెలకట్టలేనిదని వ్యాఖ్య... జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 10:16 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 36 ఏళ్లు కంప్లీట్ చేసుకొని 37వ ఏట అడుగుపెట్టాడు ఈ సందర్భంగా ఈ జూనియర్ ఎన్టీఆర్‌‌కు సినీ రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ అందజేసారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తన అభిమానులకు తారక్ ధన్యవాదాలు తెలిపాడు. ఫ్యాన్స్ ను ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశాడు.'మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా నిలుస్తున్న మీరే నా బలం. మీ రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని కాగలను? చివరిదాకా మీకు తోడుగా ఉండటం తప్ప' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తన సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తారక్ అన్నాడు. అందరి ట్వీట్లు చదవడం గొప్పగా అనిపించిందని... మీరందరూ ఈరోజును మరింత స్పెషల్ గా మార్చారని చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa