లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. కుటుంబ పోషణ కూడా కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ హీరో, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ శివాజీ ముందుకొచ్చారు. తన వంతుగా ఆర్థిక సాయం చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు రూ. 2 లక్షల చెక్ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన శివాజీని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభినందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa