ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటన అంటే నాకు చాలా ఇష్టం

cinema |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 11:03 AM

అనుపమ.. 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా కేరళలో సూపర్ హిట్‌‌ అవ్వడంతో ఈ భామకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ భామ.  'నటిని కావాలని చిన్నప్పటి నుంచీ కలలు కన్నాను.. నెరవేర్చుకున్నాను..' అంటోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'అవును, సినిమాలంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమే. ఈ నటన అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ వృత్తిని చాలా ప్రేమిస్తాను.. సెట్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగుకి దూరం కావడంతో బాధగా వుంది. మళ్లీ ఎప్పుడు సెట్లో అడుగు పెడతానా అని ఆత్రుతగా వుంది' అని చెప్పింది అనుపమ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa