ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను చేసే ట్వీట్లకు నాదే వ్యక్తిగత బాధ్యత : నాగబాబు

cinema |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 12:46 PM

నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా ఆయనపై నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నాయకులతో పాటు మరికొందరు కూడా ఈయన్ని టార్గెట్ చేస్తున్నారు. తాను ఎందుకలా అనాల్సి వచ్చిందో నాగబాబు చెప్పినా కూడా వినడం లేదు ఎవ్వరూ రెండు రోజుల క్రితం తన సోషల్ మీడియా ఖాతాలో నాధూరాం గాడ్సే విషయమై సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. వాటిపై ఆయన వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా మరో ట్వీట్ పెట్టిన ఆయన, తాను చేసే ట్వీట్లకు తనదే బాధ్యతని అన్నారు."నేను ఏమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా, అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబంలోని మరెవరికైనాగానీ నా అభిప్రాయాలతో ఎటువంటి ప్రమేయమూ లేదు" అని నాగబాబు వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa