మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించిన మలయాళ చిత్రం `దృశ్యం`. కుటుంబ బంధాలు, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 2013లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సింహళం మొదలైన భాషల్లో రీమేక్ చేశారు. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా అదే పేరుతో రీమేక్ చేయగా, ఇక్కడ కూడా మంచి హిట్టయింది. ఆ తర్వాత హిందీలో రీమేక్ చేయగా, అక్కడ కూడా విజయాన్ని సాధించింది. చక్కని కథ, మంచి పట్టుతో కూడిన స్క్రీన్ ప్లే సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి మలయాళంలో సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ మీడియాకు వెల్లడించారు. సీక్వెల్ లో కూడా మోహన్ లాల్, మీనా జంటగా నటిస్తారని చెప్పారు. ఈ సీక్వెల్ లో తొలి భాగంలో లేని పలు కొత్త క్యారెక్టర్లు కనిపిస్తాయని అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa