ముందునుంచి అనుకుంటున్నట్లుగానే అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 2న ఓటీటీ వేదికగా ఈ చిత్రం విడుదల కానుందని తెలిసింది. బుధవారం అగ్రిమెంట్ పూర్తవుతుందని ఆ తర్వాత విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. హేమంత్ మఽధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్. అంజలి, షాలినీ పాండే కీలకపాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa