ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క పోస్టుపై వ్యంగంగా కామెంట్ చేసిన లేడీ జర్నలిస్ట్... మండిపడ్డ దర్శకుడు మారుతి...

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 15, 2020, 12:45 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ చేసిన ట్వీట్‌పై ఓ మహిళా జర్నలిస్ట్ చేసిన కామెంట్ డైరెక్టర్ మారుతికి ఆగ్రహం తెప్పించింది. దాంతో తనదైన శైలిలో ఆమెకు కౌంటర్ ఇచ్చారు. త్వరలో తల్లి కాబోతున్న అనుష్క తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై ఓ మహిళా జర్నలిస్ట్ కాస్త వ్యంగ్యంగా స్పందించారు. 


`అతను మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌కు మహారాణిని చేయలేదు. మరీ, అంత సంబరపడక`ని కామెంట్ చేశారు. ఈ కామెంట్‌పై మారుతి స్పందిస్తూ.. `ఓ మహిళా జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్ చేయడం విచారకరం. ఇంగ్లండ్‌కు మహారాణి కావడం కంటే ఓ బిడ్డకు తల్లి కావడం ఓ మహిళకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అవును.. ప్రతి మహిళా ఒక మహారాణే. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లూ ఓ గొప్ప సామ్రాజ్యమే. ఆమె సెలబ్రిటీ కావడం కంటే ముందు ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంద`ని రిప్లై ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa