మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గుండు బాస్‌గా కనపడి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. చిరు గుండుపై టాలీవుడ్ అభిమానుల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఆయన గుండు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఎన్నో ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
ఆయన నిజంగానే గుండు చేయించుకున్నారా? లేక తన తదుపరి సినిమా ప్రాజెక్టు కోసం ఫొటోషూట్ లో పాల్గొన్నారా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. చిరంజీవి ట్విట్టర్ ఖాతాలోనూ డీపీగా గుండుతో ఉన్న ఓ కార్టూన్‌ను పెట్టుకోవడం విశేషం. ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయ్యాయి. అభిమానుల సందేహాలన్నింటినీ చిరంజీవి ఈ రోజు సమాధానమిచ్చారు.
'మేకింగ్ ఆఫ్ అర్బన్ మాంక్' అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. తనతలపై వెంట్రుకలు మాయమై, గుండు ఎలా ప్రత్యక్షమయ్యిందో ఈ వీడియో ద్వారా తెలిపారు. ఆయన నిజంగా గుండు చేయించుకోలేదని, ఫొటోషూట్ లో భాగంగానే మేకప్ మాయతో గుండు గెటప్ వేయించుకున్నారని దీని ద్వారా తెలుస్తోంది.
Chiranjeevi Gundu Look Making Video | Megastar Chiranjeevi New Look | TFPC https://t.co/NXEIVqNey5 via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) September 15, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa