ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా 'చావు కబురు చల్లగా' మూవీ ఫస్ట్ గ్లింప్సె..

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 03:26 PM

యంగ్ హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా "చావు కబురు చల్లగా" మూవీ టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వ్యక్తిగా కార్తికేయ కనిపించనున్నాడు. 'చావు కబురు చల్లగా'లో ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కార్తికేయ ఊర మాస్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. మాట్లాడే తీరు ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.
ఇక ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా నటిస్తూనే నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో ప్రతినాయకుడిగాను నటించాడు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa