యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా ఈ చిత్రంలో చేయబోతోన్న విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్'లో చేసేందుకు ఓకే చెప్పడంతో.. అప్పటి నుంచి ఆ సినిమా వార్తలే కానీ, నాగ్ అశ్విన్ సినిమా గురించి ఎటువంటి వార్తలు వినిపించడం లేదు. అయితే తాజాగా ప్రభాస్‌తో సినిమా చేసే ముందు నాగ్ అశ్విన్ ఓ వెబ్ సిరీస్‌ను కంప్లీట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఓటీటీ కోసం నాగ్ అశ్విన్ ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్‌ను నలుగురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారట. ఇందులో శృతిహాసన్ ప్రదాన పాత్ర పోషించనుందని అంటున్నారు. అయితే తనకొచ్చిన పార్ట్‌ను నాగ్ అశ్విన్ కంప్లీట్ చేసినట్లుగా సమాచారం. ప్రభాస్‌తో సినిమా అనుకున్న తర్వాత నాగ్ అశ్విన్ కామ్‌గా ఈ వెబ్ సిరీస్‌ను పూర్తి చేశాడని అంటున్నారు. మరో వైపు ప్రభాస్ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ పనుల్లో కూడా ఆయన పాల్గొంటున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa